Breaking News

మాజీ మంత్రి జోగి నివాసంపై రాళ్లదాడి

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ నివాసంపైకి రాళ్లు విసురుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ ను పట్టించుకోని వ్యక్తులు జోగి నివాసంపై రాళ్లు విసిరి కారులో పరారయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని వర్గాలకు సమాచారం అందడంతో వారం క్రితం జోగి నివాసం వద్ద పోలీసులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ముగ్గురు భద్రతా సిబ్బంది, ఇబ్రహీంపట్నం పోలీస్ కానిస్టేబుల్ ఒకరు నిత్యం జోగి నివాసం వద్ద పహారా కాస్తున్నారు ఇదిలా ఉండగా ఏపీ 39 కేడీ 3267 నెంబర్ గలకారులో నలుగురు వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో ఇబ్రహీం పట్నం రింగ్ సెంటర్ వైపు నుంచి ఫెర్రీ రోడ్డులోని జోగి నివాసం దాటిన తరువాత యూ టర్న్ తీసుకుని జోగి నివాసం వద్ద ఆపారు. కారులో నుంచి మొదట ఒక వ్యక్తి దిగి వెంట తెచ్చుకున్న రాళ్లను జోగి నివాసం పై విసిరాడు. గమనించిన కానిస్టేబుల్ అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. మరో ఇద్దరు వ్యక్తులు కారు దిగి కానిస్టేబుల్ పై తిరగబడ్డారు. కానిస్టేబుల్ ఆపే ప్రయ త్నం చేసినా తమను ఆపొద్దని జోగి నివాసంపై రాళ్లు విసిరారు. అనంతరం వారు వచ్చిన కారులోనే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వైపు పరారయ్యా రు. దాడి జరిన సమయం లో జోగి నివాసంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులెవరూ లేరు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ దాడిలో జోగి నివాసం గేటు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్య నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా కొద్ది గంట ల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా జోగి ఇంటిపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *