విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో బాగంగా 21 వ రోజు ఇబ్రహీంపట్నం ఎ పి జెన్కో నందు యోగ ఉత్సవాలలో పాల్గొన్న యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డా. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ అసహజ మరణాల తగ్గింపుకు యోగ శక్తి చికిత్సనీ అన్ని ఆరోగ్య విభాగాలు ప్రోత్సహించాలిసిందిగా కోరారు. ప్రస్తుతం సంభవిస్తున్నటువంటి మరణాలలో ఎక్కువ శాతం సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా వికటించడం మరియు సరైన వైద్యం అందకపోవడం లేదా వికటించడం వాటి వలన సంభవిస్తున్నాయని యోగ శక్తి చికిత్స ద్వారా ఈ మరణాలను గణనీయంగా తగించవచ్చునని తెలిపారు. ఈ యోగశక్తి చికిత్సను కొంతమందిపై డిమనెస్ట్రేషన్ చేసి చూపించారు. ప్లాంట్ చీఫ్ నాగరాజు మాట్లాడుతూ యోగ అందరూ ప్రాక్టీస్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపకులు డా.మాకాలసత్యనారాయణ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూరిండెంట్ ఇంజినీర్ సురేష్ బాబు, డి ఎస్ సుశీల, ఎపిఎస్ఈ ఇంజినీర్స్ అసోసియేషన్ ట్రెజరర్ వెంకట రమణ, డిఈ సురేష్, ఉద్యోగులు పాల్గొని యోగ చేశారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …