-ఆందోళన చెoదాల్సిన అవసరం లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా డయెరియా కేసులు నమెదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారిణి డాక్టర్ యం.సుహసిని మరియు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తన బృందంతో ఆయా ప్రాంతాలు హూటాహుటిన అర్దరాత్రి సందర్శించి డయెరియా వ్యాధి నివారణా చర్యలు చేపట్టడం జరిగినది. వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. అనుమంచిపల్లి , బూదవాడ, జగ్గయ్యపేట టౌన్, షేర్ మహమ్మద్ పేట నుండి ఒక్కరు లేక ఇద్దరు విరోచనాలతో బాధపడుతున్నారని వారు వెంకట సన్నీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని వారు కూడా క్షేమంగా ఉన్నారని ఎవరు భయపడవలసింది గాని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. ఈ ఆసుపత్రి లో చికిత్స తీసుకోనుచున్న డయెరియా రోగులు వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా తెలియజేసి నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నవని తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ పరిస్థితిని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య సందర్శించారు. గౌరవ వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ మరియు ఆరోగ్య శాఖ కమిషనర్ పరిస్థితిని ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎమ్. సుహాసిని సందర్శించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డా.అనిల్ కుమార్.,ఏ.ఏన్.ఏమ్ లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.