Breaking News

రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

-రబీ కరువు పరిస్థితులను అధ్యయనం చేసిన కేంద్ర బృందం..
-నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక..
-రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలి..
-ఉపాధి హామీ పథకం క్రింద అదనంగా మరో 50 పని రోజులు కల్పించాలి..
-అజయ్ జైన్, రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రబృందాన్ని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ జైన్ కోరారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం కేంద్ర కరువు బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు.

నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని కరువు ప్రభావిత మండలాల్లో నాలుగు రోజులుగా పర్యటించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) సీఈఓ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ నేతృత్వంలోని సభ్యులు డా.పొన్నుస్వామి, సునీలే దుబే, చిన్మయ్ పుండ్లికరావు గోత్కరే, ఆశిష్ పాండే, అరవింద్ కుమార్ సోని, మన్నూజీ ఉపాధ్యాయ్, ఎస్ సి కశ్యప్, మదన్ మోహన్ మౌర్య, అనురాధ బట్నా ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండి రోణంకి కూర్మనాథ్, ఇతర అధికారులతో భేటీయై చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. ఆరు జిల్లాల్లో 63 తీవ్ర కరువు మండలాలు, 24 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33% అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిందని అన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలని కోరారు. అలాగే, ఉపాధిహమీ పథకం క్రింద అదనంగా మరో 50 పనిరోజులు కల్పించాలని కేంద్ర బృందానికి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) సీఈఓ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ మాట్లాడుతూ.. కరువు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కరువు పరిస్థితుల వాస్తవికతను తెలియజేశాయని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని రితేష్ చౌహాన్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సి. హరి కిరణ్, రిహబిలిటేషన్ & రీసెటిల్మెంట్ శాఖ కమిషనర్  డా. సి.శ్రీధర్, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్, పీఆర్ & ఆర్డి జాయింట్ కమిషనర్ శివ ప్రసాద్, ENC RWS చీఫ్ ఇంజినీర్ -2 టి. గాయత్రి దేవీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ రవీంద్ర, భూగర్భ జలవనరులశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసరావు, భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ విశ్వేశ్వరరావు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ తిరుమలరావు, అర్బన్ వాటర్ సప్లై శాఖ చీఫ్ ఇంజినీర్ బ్రహ్మాజీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *