శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి పర్యటన రంగం ప్రభావితం అంశాలు పై సమీక్ష నిర్వహించారు .
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో కడియం నర్సరీలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని పి పి పి విధానంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘ గోదావరి గట్టు ఉందని, ఆయా ప్రాంతాల్లో పర్యటక పరంగా బోటింగ్, సహస క్రీడలు, ఇతర అనుబంధ ఉల్లాసం కలిగించే అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై పిపిపి విధానంలో ప్రతి పదనలు రూపొందించి నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లాలో కడియం నర్సరీలకు ఉన్న ప్రాధాన్యత, పర్యటక పరంగా వున్న గుర్తింపు ను మరింత ముందుకు తీసుకుని వెళ్ళడం పై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. కాటేజ్, కాన్ఫరెన్స్, బోటింగ్, మెడికల్, వెల్ నెస్, క్రీడలు, అమ్యూజ్ మెంట్ పార్కు, టీ/ కాఫీ పాయింట్స్ తదితర ప్రత్యేక గుర్తింపు కలిగిన వాతావరణం కలుగ చేస్తే రెండూ మూడు రోజుల పాటు పర్యాటకులు వొచ్చే అవకాశం ఉందని తెలిపారు. వివిధ నర్సరీలను అనుసంధానం చేస్తూ పర్యాటకులు ఒక మధురానుభూతి పొందేలా ఆయా నర్సరీల యాజమాన్యంతో సంప్రదించి, సానూకులత పరిస్ధితులు కల్పన చేపట్టాలన్నారు. గోదావరీ రివర్ బెడ్ మీద సహస, మనో ఉత్సాహం కలుగ చేసే క్రిడాంశల, పిల్లలను ఆకట్టుకునే రీతిలో ఏర్పాట్లు చెయ్యాల్సి ఉంటుందన్నారు. బోటింగ్, సహస క్రీడలు, ఆహాల్లాద పరిస్థితులు పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇకో టూరిజం ఏర్పాట్లు చేసేందుకు అనువైన ప్రాంతాలు గుర్తించాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రతిపాదిత పర్యటన అంశాలపై ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్న ఏజెన్సీలతో ప్రాజెక్టు రిపోర్టు అందజేయాలన్నారు.నగరంలో మంజీరా, రివర్ బే లు ఎపి పర్యటక శాఖ సమన్వయం తో పీపీపీ విధానంలో నిర్వహిస్తున్నట్లు పర్యటక శాఖ ఆర్ డి వి. స్వామీ నాయుడు తెలిపారు. పద్మావతీ, పుష్కర్, సరస్వతీ ఘాట్ లలో బోటింగ్ పాయింట్స్ ఉన్నట్లు తెలియ చేశారు. హెవలాక్ వంతెన మీద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, టూరిజం ఆర్ డి వి. స్వామీ నాయుడు, జిల్లా టూరిజం అధికారి పి. వెంకట చలం, సహాయ మేనేజర్ పి. వెంకట చలం, బోటింగ్ సహాయ మేనేజర్ ఆర్ గంగ6ర్ లు పాల్గొన్నారు.