రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర పరిశ్రమ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చొరవ చూపడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందే శ్వరి ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల పొగాకు రైతులు, వ్యాపారులు అధికారులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని ఈ సందర్బంగా మూడేళ్లకు ఒకసారి రైతుల నమోదు, పెనాల్టీ మినహాయింపు, పొగాకు బోర్డులో సిబ్బందిని పెంచడం, బార్న్‌ల సమస్యలు తదితర సమస్యలను ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. వీటిని సమావేశంలో కూలంకషంగా చర్చించి పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. పొగాకు రైతు ప్రతినిధుల తోపాటు కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు ఆమె వినతిపత్రం సమర్పించారు. దీనిపై వెంటనే స్పందించి ఈ సమావేశం ఏర్పాటుచేసి పరిష్కార మార్గం చూపినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ పురందేదేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు తాను ఎల్లవేళలా అండగా నిలుస్తానని ఆమె ప్రకటించారు.
Tags rajamandri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …