-తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ మరియు డ్రైవర్లకు
-జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం.సుబ్రహ్మణ్యం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక నిలువల నుండి ఎవరైనా ఇసుక లోడింగ్ మరియు రవాణా చేయుట చట్ట రీత్యా నేరం, ఎవరైనా రవాణా చేసినచో అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం. సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా లోని 7 ఇసుక నిలువల డిపో నందు వర్షా కాలం నిమిత్తం ఇసుక నిలువ ఉంచడం జరిగిందని, సదరు ఇసుక నిలువల నుండి ఎవరైనా ఇసుక లోడింగ్ మరియు రవాణా చేయుట చట్ట రీత్యా నేరం మరియు రవాణా చేసినచో చట్ట పరమైన చర్యలకు అర్హులని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక లారీ ఓనర్స్ మరియు డ్రైవర్లు గమనించాలని జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం.సుబ్రహ్మణ్యం ఆ ప్రకటనలో తెలిపారు.