Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

-రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా: మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం చేరుకున్న మంత్రివర్యులకు ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం నందు మంత్రివర్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ…గత ప్రభుత్వం హయంలో రాష్ట్రం ఎదుర్కున్న కష్ట నష్టాల నుండి గట్టెంకించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు, మహిళలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని అవకతవక నిర్ణయాలతో, దూరాలోచలన లేకుండా చేసిన ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడి ఉందని నూతన ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాన్ని పారిశ్రామికoగా, వ్యవసాయపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని ఇందుకు అవసరమైన అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని వేంకటేశ్వర స్వామి వారిని ఈ సందర్భంగా కోరుకున్నానని తెలిపారు.అదే విధంగాఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తన మొదటి సంతకం చేశారని ఆ హామీలలో భాగంగా రేపటి రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను రూ.4000/- ను, వికలాంగుల పెన్షన్ ను రూ.15,000/- అదే విధంగా తదితర పెన్షన్లను మొత్తం 65 లక్షల మందికి రూ.4500 కోట్లు లబ్ధిని ప్రజలందరికీ తమ ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చే కార్యక్రమం రేపటి జూలై 1 వ రోజున ఇవ్వనున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రిని , రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఆశీర్వదించాలని ఆ శ్రీవారిని ప్రార్తించానని అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *