– వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ప్రత్యేకంగా దృష్టిసారించి సీజన్‌ను విజయవంతం చేసేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సృజన.. వ్యవసాయం, ఉద్యాన, పట్టు, పశుసంవర్థక, మత్స్య శాఖలతో పాటు మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక అమలు, జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, భవిష్యత్తు అవసరాలు, విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు; సీసీఆర్‌సీ కార్డుల పంపిణీ, పంట రుణాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. జిల్లాలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సక్రమమైన కార్యాచరణ ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ సాగును విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగంపై రైతులకు సరైన విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సాగుచేస్తున్న ఉద్యాన పంటలు, సాగు విస్తీర్ణం, దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాలు తదితరాలపై చర్చించారు. రైతు బజార్ల కార్యకలాపాలపైనా సమీక్షించారు. ఉద్యాన శాఖ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా సమీక్షించారు. పశుసంవర్ధక శాఖపై సమీక్ష చేస్తూ పశువులకు రోగనిరోధక టీకాలు, పశువుల దాణా, పశు బీమా, పశు సంచార ఆరోగ్య సేవా కేంద్రాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టు, మత్స్య శాఖలకు సంబంధించి జిల్లాలోని కార్యకలాపాలపై కూడా కలెక్టర్ జి.సృజన సమీక్షించారు. వివిధ శాఖల పనితీరులో పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సృజన తెలిపారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డా. ఎస్.నాగమణెమ్మ, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. కె.విద్యాసాగర్, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, సెరీకల్చర్ ఆఫీసర్ ఎన్.సత్యనారాయణ, మత్స్య శాఖ అధికారి పెద్దిరాజు, ఏపీఎంఐపీ పీడీ పి.ఎం.సుభానీ, ఏటీఎంఏ పీడీ యు.నరసింహరావు, మార్క్‌ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, అగ్రీ ట్రేడ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.