-కేసలి అప్పారావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని జిల్లాల జాయింట్ యెక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్త్రం లో అన్ని శాఖల విభాగాల సమన్వయం, భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దిడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు సంయుక్తంగా నిన్న డిల్లీ విజ్ఞాన భవన్ లో బాలలు మత్తు పదార్థాలు మరియు మారక ద్రవ్యాలు నియంత్రణ చర్యలు గురుంచి మన దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల ,కేంద్ర పాలిత ప్రాంతాలు కు సంబంధించి బాలలు తో పనిచేస్తున్న కీలక ముఖ్య శాఖలగు బాలల హక్కుల కమిషన్, పోలీసు శాఖ, విద్యా శాఖ, ఎక్సైజ్ శాఖ,సాంఘిక సంక్షేమశాఖ,పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ,ఆరోగ్య శాఖ మొదలగు శాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి గౌ.శ్రీ.నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల రక్షణ, సంరక్షణ,భద్రత విషయాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందించినందుకు జాతీయ స్థాయిలో ఆ యా రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా కలెక్టర్ ను ఎంపిక చేసి పురస్కారాలను బహుకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో డ్రగ్స్ నియంత్రణ కోసము చేపడుతున్న కార్యక్రమాలును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ కేసలి అప్పారావు వివరించడం జరిగింది.ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ మరియు మధ్యం షాపులులో తప్పని సరిగా సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణ కోసము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నిపుణులు సహకారంతో చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటికే కొంతమంది రాష్ట్ర మంత్రులుతో కమిటీ వేయడం జరిగిందనీ తెలిపారు.డ్రగ్స్ నియంత్రణ కోసము మరికొన్ని ప్రత్యేక కౌన్సిలింగ్ విదానాలు, పునరావాస కేంద్రాలు , రీ ఎడిక్షన్ కేంద్రాలును ఏర్పాటు తో పాటు పాఠశాలలు, కళాశాలలు ,పునరావాస కేంద్రాలు మరియు వసతి గృహాల్లో మనస్తత్వ వేత్తల నియామకం కోసము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అలాగే అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ప్రహరీ క్లబ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.డ్రగ్స్ నియంత్రణ కోసము బాలలు మత్తు పదార్థాలు మరియు మారక ద్రవ్యాలకు దూరంగా ఉండటం కోసము, పూర్తి స్థాయిలో నియంత్రణ కోసము బాలల న్యాయ చట్టం ప్రకారం రూపొంచించబడిన చట్టాలు ను కఠిన తరంగా అమలు ,పర్యవేక్షణ మరియు ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయి లో ఒక ప్రణాళికా బద్ధంగా అవగాహణ సదస్సు కార్యక్రమాలు,ర్యాలీలు, గొడపత్రికలు,హార్డింగ్స్, పాంప్లెట్స్ చెప్పట్టడం జరుగుతుందని తెలిపారు. వీధిబాలలు, భిక్షాటన చేస్తూ ఉన్న బాలల కోసము ప్రత్యేక దృష్టి సారించింది వారికి విద్య తో కూడుకున్న అన్ని వసతులు తో పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలతో చర్యలు తీసుకుంటామని చెప్పారు.