-గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ల అందజేత
-అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి :- ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెలలోనే ఒకేరోజులో 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని, ఇంటింటికీ పింఛను పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో పింఛన్ల పంపిణీ జరగలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరు అనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువు అయ్యిందని సిఎం అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సిఎం అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.