రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు ఈ మేరకు సిఎండి, ఏపీఈపీడీసీఎల్ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆదేశాలు జారీ చేసినట్లు ఏ.పి.ఇ.పి.డి.సి.యల్: ఆపరేషన్ సర్కిల్ రాజమహేంద్రవరం పర్యవేక్షక ఇంజనీరు టీవీఎస్ఎన్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) వినియోగదారులు సౌలభ్యం కోసం విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆదేశాలు జారీ చేశారు. ఆర్ బి ఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్ పే, జీ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదు కనుక వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ eastern power ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసికొనిగాని లేదా సంస్థ వెబ్సైటు www.apeasternpower.com నుంచి గాని బిల్లులు చెల్లించవచ్చని మూర్తి తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్ లో గానీ లేదా సంస్థ వెబ్సైటులోగాని బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్ పే, జీ పే, పే టిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాల్లెట్స్, కాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేసారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …