రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫ్రీ సీటు లలో ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు అక్కడ అందచేస్తున్న విద్యా బోధన విధానాన్ని పరిశీలించడం జరిగిందని రాజమండ్రీ రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక లిట్టిల్ ప్యారడైజ్ స్కూల్ ను జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు , ఇతర అధికారులతో కలసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆర్డీఓ చైత్ర వర్షిణి మిగిలిన విద్యార్థుల తో పాటుగా ఉచిత సీటు పొందిన విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్న విధానమును పాఠశాలలో పరిస్థితిని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించి యున్నారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారి ఆదేశాల మేరకు ప్రవేటు పాఠశాలలో తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియ చేసారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో ఆర్డీఓ మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత లక్ష్యంతో ప్రవేటు స్కూల్స్ లో కొన్ని సీట్లు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల కు తప్పనిసరిగా కేటాయించి ఇతర పిల్లలతో సమానంగా విద్యా బోధన ఇవ్వవలసిన నైతిక, సామాజిక బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …