అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్‌పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సేవలు అందబాటులోకి వచ్చాయని.. అందరూ ఉపయోగించుకోవాలని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రాబోయే అంతర్జాతీయ సర్వీస్ (కార్గో కోసం) నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి 2021లోనే కార్గో సేవలు ప్రారంభంకావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇప్పటికి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్టులో ఒమేగా కంపెనీ కార్గో సర్వీసును పునరుద్ధరించడం అభినందనీయం అని గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి అన్నారు. కార్గో సర్వీస్ తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని.. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచికమన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …