విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శిగా వి విజయకుమార్ నియమితులయ్యారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న డాక్టర్ రమణబాబు పదవీ విరమణ పొందగా, నెల్లూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా బాధ్యతలలో ఉన్న విజయకుమార్ కు అవకాశం లభించింది. సాంకేతిక విద్యా శాఖలో 1982లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా చేరిన విజయకుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కందుకూరు, గూడూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మరో వైపు సాంకేతిక విద్యా శాఖ నేతృత్వంలో జరిగే విభిన్న కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియకు ఛీప్ క్యాంప్ అఫీసర్ గా కూడా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …