-తిరుపతి జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు
-హాజరుకానున్న 5273 అభ్యర్థులు : జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 7న జిల్లాలో జరగనున్న యూపీఎస్సీ EPFO, ESIC పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డి ఆర్ ఓ అధికారులతో రేపు జరగనున్న యుపిఎస్సి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 7 న యుపిఎస్సి నిర్వహించనున్న EPFO లోని పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఉ. 9.30 నుండి ఉ 11.30 వరకు 3 సెంటర్లలో , ESIC లోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు మ.2.30 నుండి మ.4.30 వరకు 7 సెంటర్లలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 10 సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగిందనీ 5273 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు 10 మంది తాసిల్దార్లను లైజన్ అధికారులుగా, 6 జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని , తిరుపతి ఆర్.డి.ఓ పరీక్షా పేపర్ల కస్టోడియన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని , పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం,విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్దం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్ టి సి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
EPFO పరీక్షా కేంద్రాల వివరాలు:
50008 SV యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, SV యూనివర్సిటీ క్యాంపస్, తిరుపతి
50015 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం , తిరుపతి
50005 శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, బాలాజీ కాలనీ, తిరుపతి
ESIC పరీక్షల కేంద్రాల వివరాలు :
50008 SV యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, SV యూనివర్సిటీ క్యాంపస్, తిరుపతి
50007 SV యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ప్రకాశం భవన్,SV యూనివర్సిటీ, తిరుపతి
50015 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం , తిరుపతి
50001 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి
50006 ఎస్ వి యూనివర్సిటీ క్యాంపస్ హై స్కూల్, బాలాజీ కాలనీ తిరుపతి
50005 శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ చర్చ్ రోడ్డు, బాలాజీ కాలనీ తిరుపతి
50010 ఎస్.వి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కే.టీ రోడ్, తిరుపతి
ఈ సమావేశంలో ఆర్డీఓ తిరుపతి నిషాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు