-అర్బన్ తాసిల్డార్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ఆరా తీసి పరిష్కారం అర్థవంతంగా నాణ్యతగా ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేసి ఫిర్యాదుదారునితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ లోని రెవెన్యూ పరిపాలన యంత్రాంగం లోని పలు సెక్షన్లను, తిరుపతి అర్బన్ తాశిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం ముందుగా స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ పరిపాలన యంత్రాంగం లోని పలు సెక్షన్లను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
అనంతరం తిరుపతి అర్బన్ తాశిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మ్యుటేషన్లకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కార వేదిక సంబంధించిన ఫిర్యాదులలో పరిష్కరించిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కారం అర్థవంతంగా నాణ్యతగా ఉండాలని పలు సూచనలు చేస్తూ అందులోని ఒక ఫిర్యాదు దారంతో నేరుగా ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను బాధ్యతగా వారి సంతృప్త స్థాయిలో పరిష్కరించేలా అంకిత భావంతో అందరూ పని చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయం బయట ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.