Breaking News

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా-అగ్నివీర్‌ పధకంలో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్ బాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో పనిచేసేందుకు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్‌ ఒకేషనల్‌. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి అని ఆయన తెలిపారు.ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో http://agnipathvayu.cdac.in లింక్ ద్వారా జూలై 8 వ తేదీ నుండి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అర్హత గల అవివాహిత పురుషులతో పాటు, మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

అదే విధంగా ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది అని ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు అని ఆయన పేర్కొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *