Breaking News

పట్టిసీమతోనే కృష్ణాడెల్టా సన్యశ్యామలం

-సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
-విజయవాడలో కృష్ణా తూర్పుడెల్టాకు నీటి విడుదల సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డా. నిమ్మల రామానాయుడుకు అభినందనలు తెలిపిన రాష్ట్ర సాగునీటి సంఘాల సారధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో 2015లో పట్టిసీమ ద్వారా. కృష్ణా,గోదావరి నదులను అనుసంధానం చేసి కృష్ణాడెల్టాకు గోదావరిజలాలను అందించటం వలన కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయినదని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటి మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారులు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. ఈరోజు ఉదయం విజయవాడలోని ప్రకాశంబ్యారేజ్ దిగువ ఉన్న కృష్ణా తూర్పుడెల్టా రెగ్యూలేటర్ నుండి ప్రజాప్రతినిధులు, జలవనరులశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో శాస్త్రీయుత్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి న అనంతరం కృష్ణాడెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డా. నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా తొలుత ఈ కార్యక్రమాన్నికి విచ్చేసిన రాష్ట్ర జలవనరులశాఖ మంత్రివర్యులు. డా.నిమ్మల రామానాయుడుకు సాగునీటి వినియోగాదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణాతూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మన్ గుత్తా శివరామకృష్ణ, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ తదితరులు రైతుపచ్చకండవా వేసి పుష్పాగుచ్చంతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసినారు. ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి వినియోగాదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ భారతదేశంలో మెట్టమొదటి సారిగా డా.కె.ఎల్.రావు గారి సూచన మేరకు 2015లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి 2015 నుంచి 2019 వరకు కృష్ణాడెల్టాలోని ఉమ్మడి కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలోని 13 లక్షల ఎకరాలలో వున్న వరి,చేపలచెరువులు, రొయ్యల చెరువులకు సాగు నీరు ఇవ్వటం వలన రైతులకు 45 వేల కోట్ల రూపాయిలు ఆధాయం రావటమే కాకుండా భారతదేశ జి.డి.పి లో కృష్ణాజిల్లా రెండవస్థానంలో నిలిచిందని అన్నారు.గత వై.సి.పి ప్రభుత్వంలో పట్టిసీమను గాలికి వొదిలివేసి కనీసం పంపులను ఓవర్ ఆయిలింగ్ చేయకుండా కృష్ణా ఎగువ భాగం నుంచి వచ్చే జలాలను పులిచింతలో నిల్వ చేయకుండా అసమర్ధ నీటి యాజమాన్యంతో కృష్ణాడెల్టాను ఎండపెట్టన్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సమీక్షించి పట్టిసీమ పంపులను సమయత్తం చేసి ఈ నెల 3 తారీఖునే పట్టిసీమ ద్వారా గోదావరిజలాలను పోలవరం కుడి ప్రధాన కాలువకు విడుదల చేసి, ఈరోజున కృష్ణా తూర్పుడెల్టాకు జలవనరుల శాఖ మంత్రివర్యులు డా. నిమ్మల రామానాయుడు కృష్ణాడెల్టాలోని త్రాగునీటికి, వరినారుమళ్ళకు నీటిని విడుదల చేయటం పట్ల కృష్ణాడెల్టా రైతాంగం తరపున జలవనరుల శాఖ మంత్రివర్యులకు అభినందనలు తెలుపుతూ ఈ నీరు కృష్ణాడెల్టాలో ఇప్పటికే వెదజల్లే పద్దతిలో వరినాట్లు వేసిన రైతులకు మొదటి తడికి సాగు నీరు అంది ఎంతో ఉపయోగం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *