-జగన్నాథుడికి హారతిచ్చిన ఎంపి కేశినేని చిన్ని
-ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
-చేరా పహారా సేవ చేసిన ఎంపి కేశినేని చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం పూరీలో జగన్నాథ్ రథయాత్ర. నాలుగేళ్ల నుంచి ఆ జగన్నాథుడి రథయాత్ర ను నగరంలో నిర్వహించటం విజయవాడ వాసుల అదృష్టం. జిల్లాలో జగత్తుని నడిపించే శ్రీ కృష్ణుడి మందిరం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
ఎంజి రోడ్డులోని ది అడ్రస్ మాల్ లో శుక్రవారం నిర్వహించిన శ్రీ జగన్నాథ రథోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ , మంత్రి కొల్లు రవీంద్ర, బిజెపి నాయకులు పాతూరి నాగభూషణంతో కలిసి పాల్గొన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రను ఎంపి కేశినేని శివనాథ్ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ప్రారంభించారు.. అంతకంటే ముందు ఎంపి కేశినేని శివనాథ్ జగన్నాథుడికి చేరా పహారా సేవ చేశారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకంగా జగన్నాథ రథయాత్ర నిర్వహించడం అభినందనీయమని ఇస్కాన్ టెంపుల్ కమిటీ సభ్యులను కొనియాడారు.ఈ రథయాత్ర కారణంగా నగరం కృష్ణ కీర్తనలతో, జగన్నాథ ప్రవచనాలతో
ఆధ్యాత్మికత సంతరించుకుందన్నారు. ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ నిర్మించాలనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరి ఆఫ్ ఆంధ్రా కు తన సాయం ఎప్పుడు వుంటుందని ప్రకటించారు.
పూరీ తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద జగన్నాథ రథయాత్ర ఇక్కడ నిర్వహిస్తున్న ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారి దాస్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్రానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇస్కాన్ చేయూత వుండాలని ఆకాంక్షించారు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలనేదే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముకుందా మాధవ దాసు, ఇస్కాన్ సౌతిండియా బ్యూరో మెంబర్స్ శంఖధారి దాస్, వేణుధారి కృష్ణ దాసు, పి.ఆర్.వో శ్యామ్ సుందర్ అచ్యుత్ దాస్, టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ, నరసింహ చౌదరి పాల్గొన్నారు.