విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
170 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులను నూతన విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మోడ్రన్ ఫిష్ మార్కెట్ నందు మంచినీటి సదుపాయం 11వ నెంబర్ వరకు నంబర్ జెట్టి వరకు త్రాగునీటి వసతి కల్పించాలని విశాఖ పోర్టు , జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ లోనే మరమ్మత్తులు చేసుకోవడానికి సరైన సదుపాయం లేదని డ్రై డాక్ లో ఉన్నటువంటి ట్రాలీలను రిపేర్ చేపించాలని, హార్బర్లో ప్రమాదాలు, అవసరాలకు అనుగుణంగా క్రేన్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ దృష్టికి అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తీసుకొని వెళ్లారు. ట్రాఫిక్ సమస్య హార్బర్ లో అధికంగా ఉందని ట్రాఫిక్ పోలీసులు సహకారంతో ఆటోలను ఫిషింగ్ హార్బర్లోకి రాకుండా నిరోధించాలని, అనవసరంగా పేరుకుపోయినటువంటి వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, మత్స్య వ్యర్ధాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా జీవీఎంసీ అధికారులను వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ కొరకు అవసరమైన డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వ్యర్ధాలు హార్బర్ లో లేకుండా చూడాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులను విశాఖ పోర్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ వికాస్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వివరించారు. చేపలు వేలంకేంద్రం షెడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరగా రెండు నెలల కాలం లో పూర్తిస్థాయిలో చేపలు విక్రయ వేలం కేంద్రం ను అందుబాటులోకి వినియోగంలో తీసుకొని వస్తామని పోర్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ, జీవీఎంసీ వాటర్ సప్లై రవి, విశాఖ పోర్టు అథారిటీ ఈ ఈ అరుణ్ కుమార్, జే.ఇ.విశ్వనాథ్. వాటర్ సప్లై ఇ ఇ శేఖర్, ఎఫ్ డి ఓ ఆశాజ్యోతి, డాల్ఫిన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి వీర్రాజు, కార్యదర్శి వలిశెట్టి చిన్న, సూరాడ సత్తిబాబు, గుంటు దానయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags Visakhapatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …