Breaking News

ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు వద్దు

-విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ ఫిర్యాదుపై స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-జీవీఎంసీ అధికారుల వివరణ కోరిన ఉప ముఖ్యమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలోని ముడసర్లోవ పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని విషయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ రాసిన రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నిత్యం వందలాది మంది ప్రజల సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ.. ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని కోరారు. ఈ విషయమై తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. జీవీఎంసీ అధికారులు అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని పవన్ కళ్యాణ్ కి తెలియచేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *