గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి నాణ్యమైన అల్పాహారం, భోజనంను నామమాత్రపు ధరకే అందించేందుకే సంకల్పించిన గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లను ఆగస్ట్ మొదటి వారానికి పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో జరుగుతున్న మరమత్తు పనులపై శనివారం ఇంజినీరింగ్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభం చేయనున్నదని, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 8 అన్నా క్యాంటీన్లను ఆగస్ట్ మొదటి వారానికి వినియోగంలోకి తీసుకురావడానికి ఇప్పటికే రూ.74 లక్షలతో టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్లు నిబందనలకు అనుగుణంగా, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల ఏఈలు పనులను వేగంగా జరిగేలా భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రదానంగా పెయింటింగ్, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్ లు, లైట్లు, గ్లాస్ డోర్స్, ఫ్లోర్ మరమత్తులు చేపట్టాలన్నారు. హ్యాండ్ వాష్ పాయింట్స్, నీటి సౌకర్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పనుల పురోగతిపై డిఈఈలు, ఈఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, కమిషనర్ చాంబర్ కి నివేదిక ఇవ్వాలన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …