-కొవ్వూరు, తాళ్లపూడి గోదావరీ బండ్ మార్గంలో 360 డిగ్రీ నిఘా సిసి పర్యవేక్షణ
-ఇతర జిల్లాల కేటాయింపులకై ఆయా జిల్లాల డి ఎల్ ఎస్ ఎ అభ్యర్థన తప్పనిసరి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ లు, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గోదావరి కి వరద నీరు ప్రభావం దృష్ట్యా డీసీల్టేషన్ పాయింట్స్ వద్ద నిలువ ఉన్న ఇసుక వినియోగానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, భవన నిర్మాణాలకు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులకి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానంలో కేటాయింపులు జరుపవలసి ఉందన్నారు. బల్క్ కేటాయింపుల విషయంలో జిల్లా స్థాయి కమిటీలో చర్చించి సభ్యుల ఆమోదం అనుసరించి కేటాయింపులను చేపట్టడం జరుగుతున్నట్లు తెలియ చేసారు. అదే విధంగా ఇతర జిల్లాలకి సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్ / డి ఎల్ ఎస్ ఏ ద్వారా వొచ్చిన సిఫార్సులను అనుసరించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వీటిపై విజిలెన్స్ ఆయా జిల్లాల పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అవసరాలకి అనుగుణంగా ఇసుక లభ్యత విషయంలో ఎటువంటి లోటు లేకుండా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం గోదావరి ఉధృతి ప్రతీకూల పరిస్థితి మేరకు స్టాక్ పాయింట్స్ వద్ద ఉన్న నిలువ కంటే ముందుగా డీసీల్టేషన్ వద్ద ఉన్న నిలువలని గుర్తించి కేటాయించాల్సి ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వున్న ఇసుక నిలవ అంచన వేయాలని అధికారుల ఆదేశించారు. వరదలకు కారణంగా ఆయా పాయింట్స్ వద్ద ఉన్న ఇసుక నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయే అవకాశం ఉందని తెలిపారు. బల్క్ కేటాయింపుల విషయంలో డి ఎల్ ఎస్ ఏ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వ్యక్తిగత నిర్మాణాలకు చెందిన నియమ నిబంధనలు అనుసరించి ఆధార్, ప్లాన్, పంచాయతీ అధికారి ధృవీకరణ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఆయా లావాదేవీలకు చెంది సబ్, ఇతర సమన్వయ అధికారులు విజిలెన్స్ విషయంలో అప్రమత్తత కలిగి ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీవో లు వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి గోదావరీ బండ్ మార్గంలో 360 డిగ్రీ నిఘా సిసి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఏడు ఇసుక స్టాక్ పోయింట్ లు, 31 డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద సోమవారం సాయంత్రం నాటికి 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో , ఇతర ప్రవేటు ఏజెన్సీ లకి చెందిన బల్క్ కేటాయింపుల కోసం ఏడు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలియ చేసారు. వాటికి నిబంధనలు అనుసరించి కమిటీ ఆమోదం తెలపడం జరిగింది.
ఈ సమావేశంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె. దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు ఎం. సుబ్రహ్మణ్యం, సెబ్ ఏఎస్పి వి. సోమ శేఖర్, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై. శ్రీనివాస్, ఇరిగేషన్ ఈ ఈ – జి. కాశీ విశ్వేశ్వర రావు, ఆర్టీవో కె వి కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ – డి బాల శంకర రావు, డిపిఓ డి.రాంబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.