Breaking News

ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పై సమీక్ష

-జూలై 20 న ఓటింగు, జూలై 21 కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
-శాంతి భద్రతలు నేపధ్యంలో 144 సెక్షన్ అమలు
-ఓటు హక్కును 54 పోలింగు కేంద్రాలలో వినియోగించుకోనున్న 74,585 మంది ఓటర్లు
-జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పొలింగు, కౌంటింగ్ ఏర్పాట్లు పై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రశాంతి కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు, స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహించే ప్రోటోకాల్ కు అనుగుణంగా ఆర్బన్ బ్యాంకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ చేపట్టవలసిన ఉందన్నారు.
నగరంలోని 48 పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాలలో ఉన్న 6 పోలింగు కేంద్రాలలో ఎన్నికలలో ఓటర్లు ఓటు హక్కు వేసేలా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితా ప్రముఖంగా ప్రదర్శించాలి. ఏ ఓటరు ఏ రూం లో ఓటు వెయ్యాలో నోటీసు బోర్డు ద్వారా ప్రదర్శించడం తో మైక్ ద్వారా ఓటర్ల కు దిశా నిర్దేశనం చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి అనుమతించే క్రమంలో తనిఖీ చేసి, ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించి లోపలకు అనుమతించాలని పోలీసులకు ఆదేశించారు. ఆపోలింగ్ మెటీరియల్ పంపిణీ ముందు రోజూ , పోలింగు రోజు, స్ట్రాంగ్ రూం వద్ద, ఓట్లు కౌంటింగ్ రోజున తగిన భధ్రత ఏర్పాట్లు తో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్యాపురం సహాకార అర్బన్ బ్యాంకుకి 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అత్యంత జాగ్రత్త వ్యవహరించాలన్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని, ఆమేరకు రెవిన్యూ డివిజనల్ అధికారి వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. పోలింగు కేంద్రాలు, ప్రాంగణంలో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అర్బన్ బ్యాంకు సభ్యుల డేటా మేరకు ఓటు వేసేందుకు అనుమతించడం, అందుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అధికారిక ఫోటో గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆర్డీవో ఇతర రెవిన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. పోలింగు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.

డి ఎస్ పి కె. విజయపాల్ వివరాలు తెలియ చేస్తూ, పోలింగు రోజున 120 మంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొననున్నట్లు తెలియ చేసారు. కౌంటింగ్ కేంద్రం వెలుపుల తనిఖీలు, గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఆర్. శ్రీరాములు నాయుడు వివరాలు తెలియ చేస్తూ, అర్బన్ బ్యాంకు పరిథిలో 16 బ్యాంచిలలో 3 బ్యాంకు నియోజక వర్గాల లో రెండు బ్యాంకు నియోజక వర్గాల లో11 డైరక్టర్ల పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇందుకోసం 74,585 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పరిధిలోని 8 బ్రాంచిలలో 70,519 మంది ఓటర్లు కోసం 48 పోలింగు కేంద్రాలను ఎస్ కే వి టీ డిగ్రీ కాలేజీ, ఎస్ కే వి టి ఇంగ్లీషు మీడియం హై స్కూల్ రెండు ప్రాంగణాల్లో ఏర్పాటు చేశామన్నారు. దివాన్ చెరువు, భీమవరం, అమలాపురం , విశాఖపట్నం సీతమ్మధార, గుంటూరు బ్రాంచీలలో ఓటింగు ప్రక్రియాలో భాగంగా 4,066 ఓటర్లు తమ ఓటు హక్కును వేసేందుకు ఏర్పాటు చేశామని తెలియ చేసారు. ఓటింగ్ పూర్తి అయిన తదుపరి భద్రత మధ్య రాజమండ్రీ కి తీసుకుని రావడం జరుగుతుందని తెలియ చేశారు. ఎన్నికల అధికారి గా వి. కృష్ణ కాంత్ వ్యవహరిస్తారని తెలియ చేసారు.

ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, జిల్లా సహకార అధికారి ఆర్. శ్రీరాములు నాయుడు, ఏ ఎస్పీ అడ్మిన్ ఎస్ ఆర్ రాజశేఖర్ రాజు, జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు, బ్యాంకు ఎన్నికల అధికారి /డివిజనల్ సహాకార అధికారి వి. కృష్ణకాంత్, డి ఎస్పీ విజయ పాల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. శరత్ బాబు, అర్బన్ బ్యాంకు అధికారులు కార్యదర్శి కె . స్వరాజ్య లక్ష్మి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *