-వైసీపీ అరాచకాలు, భూ-దోపిడీలు, అఘాయిత్యాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి
-ఐయిదు ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఎంత హింసించారో అర్థమవుతోంది
-బాధితులకు అండగా ఉంటాం.. తప్పకుండా ప్రతీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం
-రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూఖ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరిల ఆధ్వర్యంలో గ్రీవెన్ సెల్ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ…”వైసీపీ నాయకుల అరాచకాలు, దోపీడీల మీద ఎక్కవ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కరించబడలేదనడానికి నేడు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యం. వచ్చిన ఫిర్యాదులను కూలంకుశంగా పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. కొందరు అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచించడమైంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పరిష్కరించగల సమస్యలను వారి దృష్టికి పంపడం జరిగింది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులచే పరిష్కరించదగిన సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్టీ పరంగా పదవులు కోరుతూ కూడా కొన్ని దరఖాస్తులొచ్చాయి. వాటిని కూడా పరిశీలించి కష్టపడ్డవారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు.