-నిడదవోలు మండలంలో సుమారు 13 వేల ఎకరాలోని పంట పొలాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది.
-ఇప్పటివరకు ఎకరాకు రు. 20 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం
-నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది
-నిడదవోలు మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన..
-పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
అల్పపీడన ప్రభావం వలన గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నిడదవోలు మండలంలోని ముంపుకు గురైన కంసాల పాలెం, సింగవరం, రావి మెట్ల పంట పొలాలను పరిశీలించి,రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు.
శుక్రవారం నిడదవోలు మండలం కంసాలి పాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో భారీ వర్షాలు కారణంగా నీటి మునిగిన పంట పొలాలను మంత్రి కందులు దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు,స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతాంగం గత నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేస్తున్న పంట పొలాలు భారీ వర్షాలు కారణంగా నీట మునిగాయన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు కలసి నిడదవోలు మండలం లోని కంసాలిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లోని ముంపు గురైన ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
నిడదవోలు మండలంలో సుమారు 16 వేల ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 13వేల ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్ల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రైతు ఇప్పటివరకు ఎకరాకు రు. 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, అది నష్టపోతామని భయపడుతున్నారన్నారు.
ముంపు ప్రాంతాల్లోని పంట పొలాలను గుర్తించామని, ఈ అంశం జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందన్నారు. కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రు. 6 వేల రూపాయలను అందించే విధంగా చర్యలు తీసుకోవడం వలన రైతులకు నష్టాన్ని నివారించగలుగుతామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు భారీ వర్షాలు కారణంగా ఏర్పడిన నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాలు కారణంగా ఈ ప్రాంతం ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకీకరణ పనులను చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఒక శాశ్వతమైన పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కార్యచరణతో నీరు పారుదలయ్యే లా ఆధునీకీకరణ పనులు చేపట్టడం వలన పంట పొలాలు ముంపుకు గురి కావని తద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉండదన్నారు. రైతాంగం ఆర్థిక ఎదుగుదలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, భారీ వర్షాలు కారణంగా పంట పొలాలు మునిగిపోకుండా నీరు పారుదలయ్యేలా శాశ్వత పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కొరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు . రాబోయే కాలంలో గండ్లు పడకుండా ఏటిగట్టు పటిష్టంగా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.