Breaking News

వరద ఉధృతి ప్రాంతాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన

-పునరావాస కేంద్రాలను, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు పర్యవేక్షించిన కలెక్టర్
-అపరిశుభ్రతకు తావు లేకుండా గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలి.
-జిల్లాలో ఇప్పటివరకు 10 వేల హెక్టార్ల పంట నష్టం వేశాం.
-ప్రభుత్వాదేశాలు మేరకు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా చర్యలు.
-కలెక్టర్ పి ప్రశాంతి

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతంలోని కుటుంబాలను చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ పి ప్రశాంతి ఇటీవలి భారీగా కురిసిన వర్షాలు వలన వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ముంపు ప్రాంతాలలో నీటిని తొలగించేందుకు డ్వామా అధ్వర్యంలో మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ కూలీలు సేవలు వినియోగించుకుని, పునరావాస పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలకు వచ్చే నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంకు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

అనంతరం నల్లజర్ల తాహసిల్దార్ కార్యాలయంలో ఎర్ర కాలువ వరద ఉధృతి వలన పంట నష్టాలపై తీసుకోవలసిన ప్రస్తుత ప్రాథమిక అంశాలపై వ్యవసాయ శాఖ, డ్వామా ఇతర అధికారు లతో సమీక్షించారు.

అనంతరం పాత్రికేయులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కావడానికి వర్షాలు కారణం కాదని, ఎర్ర కాలువ నుంచి వొచ్చిన వరద నీరు కారణం అన్నారు. గత మూడు రోజులుగా నీట మునిగిన పంటల ప్రాధమిక అంచనాలకి రావడం జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఎర్ర కాలువ వరద ఉధృతి వలన నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో కొన్ని గ్రామాలోని పంట పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. ఈ రెండు మండలాల్లో ప్రాథమిక అంచనా మేరకు సుమారు 10 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లే ఆకాశము ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఇంజన్ల తో తోడించే విధంగా డ్వామా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. క్రాప్ డామేజ్ కి సంబంధించిన ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు రాగానే ఇన్ఫిట్ సబ్సిడీని రైతులకు అందించే విధంగా తగు చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలకు ఏటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు, ముంపునకు గురైయ్యే గృహాలకు చెందిన ప్రజలను కుటుంబాలని తక్షణం పునరావాస కేంద్రానికి తరలించి ఆహారం, తగిన వైద్యం అందజేయాలన్నారు. ఆయా రీ హాబిటేషన్ కేంద్రాల్లో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సెక్రెటరీస్ ను ఆదేశించారు.

ఈ పర్యటనలో సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డ్వామా పీడీ ఏ.. ముఖ లింగం, డి ఎమ్ అండ్ హెచ్ వో డా కే. వేంకటేశ్వర రావు, తహసీల్దార్ పి. కృష్ణా రావు, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పంచాయతి ,సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *