విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలలో నోటాతో సహా నూటికి నూరు శాతం పోలింగ్ కై భారత ఎన్నికల కమిషనర్ నెలల తరబడి ఎంతగా పాటుపడుతున్నదో మనమందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండు రోజులు పాటు ప్రజాస్వామ్యానికి నిలువటద్ధంలా విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగాయి. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ స్థానంతో పాటు పాఠశాల కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థిని విద్యార్థులు రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలతగా ఆరో తరగతి విద్యార్థిని చి. వేదుల కృత్తిక (నిమ్మరాజు) తన ఓటు వేసి పోలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది.మరుసటి రోజు స్ట్రాంగ్ రూములను తెరిచి ఓట్ల లెక్కింపు జరిపించారు.
ఈ ఎన్నికల్లో అర్. తనుష్ (హెడ్ బాయ్) రేవతీ శేషాద్రి (హెడ్ గర్ల్)హరి కీరత్ సింగ్ (డిప్యూటీ హెడ్ బాయ్) కావ్యా (డిప్యూటీ హెడ్ గర్ల్)గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ గవర్నింగ్ మాజీ సభ్యులు నిమ్మరాజు చలపతి రావు మాట్లాడుతూ విజేతలతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజాస్వామ్యం పరెడివిల్లా లంటే నూటికి నూరు శాతం ఎన్నికలు అవసరం అన్నారు.ఇందుకు పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలలో ఇలాంటి ఎన్నికలు ఎంతో అవసరమన్నారు.
ఈ సందర్భంలో స్కూలు ప్రిన్సిపల్ జి భారతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మరో ప్రపంచం చూసేందుకు ఏ విధంగా ముందడుగు వేయాలో విద్యార్థి దశలోనే శిక్షణ ఇస్తున్నామని ఈ ప్రక్రియ పాఠశాల నిబద్ధతకు నిదర్శనంగా నిలువగలదన్నారు. యువ అభ్యాసకాలతో బాధ్యత పౌర కర్తవ్యాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమని తాము భావిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రక్రియలలో తమ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వీరిలో అంకితభావంతో విద్యార్థులకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నారని భారతి అన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఆర్ఎస్ శెట్టి, కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు తదితరులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
Tags Visakhapatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …