Breaking News

భారతదేశ బడ్జెట్‌ 2024-25లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్య కేటాయింపులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
1. భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రాలు సమృద్ధిగా, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ దేశంలోని తూర్పు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ ప్రణాళిక రూపొందిస్తాం. మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాల కల్పనపై ఈ ప్రణాళిక దృష్టి పెడుతుంది. ‘వికసిత్ భారత్‌’ లక్ష్యాన్ని సాధించే ఇంజిన్‌గా ఆ ప్రాంతాన్ని మారుస్తుంది.

2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రయత్నాలు చేసింది. రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి, బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 15,000 కోట్లు కేటాయిస్తాం. రాబోయే సంవత్సరాల్లో అదనపు మొత్తాలు అందిస్తాం.

3. ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించడానికి, త్వరగా పూర్తి చేయడానికి భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఆ ప్రాజెక్టు మన దేశ ఆహార భద్రతను కూడా పెంచుతుంది.

4. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని కొప్పర్తి నోడ్; హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వే, రహదార్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తాం. ఆర్థికాభివృద్ధికి మూలధన పెట్టుబడుల కోసం ఈ సంవత్సరం అదనపు కేటాయింపులు అందిస్తాం.

5. చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు అందిస్తాం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *