-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ కొండ ప్రాంతం లోగల రాయప్పరాజు స్ట్రీట్, రామాలయం స్ట్రీట్, టానర్ పేట, గుజ్జారి ఎల్లారావు మార్కెట్ సముదాయం, డాక్టర్ కెఎల్ రావు పార్క్, డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ ప్రాంతాలు మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ముందుగా 48వ డివిజన్లో గల రాయప్ప నగర్ ప్రాంతం మొత్తం పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తీసేయడమే కాకుండా, డ్రైన్ మ్యాప్ ల ద్వారా ఏ పూడికలు తీసుకుంటున్నారో ఆ పూడికలను మార్క్ చేసుకొని, సైడ్ డ్రయిన్ల ప్రవాహం మ్యాప్ ద్వారా తెలుసుకుంటూ సైడ్ కాలవల్లోని పూడికలసమస్యలను పరిష్కరించవచ్చని, ప్రజారోగ్య అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తన పర్యటనలో పరిశీలించిన బిల్డింగ్ మరియు చెట్టు వ్యర్ధాలు గమనించి ఎప్పటికప్పుడు టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సెక్రటరీలు మరియు హార్టికల్చర్ విభాగం సమన్వయంతో వ్యర్ధాలను తొలగిస్తూ పారిశుద్ధ నిర్వాహణ మెరుగుపరచాలని అన్నారు.
తదుపరి గుజ్జారి యెల్లా రావు మార్కెట్ సముదాయం పర్యటించి పరిశుద్ధ నిర్వాహన సక్రమంగా జరగాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదైనా పిమ్మట డాక్టర్ కే ఎల్ రావు పార్క్ సందర్శించి అక్కడ వాకింగ్ ట్రాక్‌ను, పార్క్ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పార్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్ కు ఆదేశాలు ఇచ్చారు. డాక్టర్ కే ఎల్ రావు స్విమ్మింగ్ పూల్ పరిశీలించిన కమిషనర్, ఒలంపిక్స్ విజయాలు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వాలని, దానికి తగ్గట్టుగా సమయాన్ని కేటాయించి కోచింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తో పాటు అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్ 1 రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 ఏ ఎస్ ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబా శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబాబు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ రజియ షబిన, సానిటరీ సూపర్వైజర్ ఓబెశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.