గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్, ఎస్.ఈ. శ్యామ్ సుందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో విభాగాధిపతులతో కలిసి ఇంచార్జి కమిషనర్ పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు రీ ఓపెన్ కాకుండా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం సదరు ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 24 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 4, ఇంజినీరింగ్ విభాగం 6, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 4, అకౌంట్స్ విభాగం 3, ఉపా సెల్ 2, ఎన్నికల విభాగానికి సంబందించి 1, జిఎస్డబ్ల్యు 1 ఫిర్యాదు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డి.సి.పి.లు, ఏసిపిలు, ఈఈలు, ఆర్ఓ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …