విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుండే అమలు చేయాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ని అతిదారుణంగా హత్య చేసిన రోజు జనవరి 30-1948వ తారీఖుని గుర్తు చేస్తూ….ప్రతి నెల అదే 30వ తారీఖుని దేశంలో ప్రజలు మర్చిపోకుండా నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ప్రతినెలా 30 తేదేన కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ క్రమంలో ఆయన తొలుత కళ్లకు గంతలు కట్టుకొని మంగళవారం గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత అలాగే కళ్లకు గంతలతో పాదయాత్ర చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని తల్లికి వందనం అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యం కాని మాటలు చెప్పే రాజకీయ నాయకు లకు వందనం, శతకోటి వందనం. నీతి లేని రాజకీయ నాయకులకు వందనం, శతకోటి వందనం. పాలకులకు అబద్ధాల పునాదుల మీద పరిపాలించటమే లక్ష్యంగా మారినా విధానమే, వారి ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యం, అది కార్పొరేట్ వ్యవస్థగా మారి పోతుంటే గాంధీ కళలు నెర వేరేదెప్పుడు? ఎందరో అమరవీరుల త్యాగాలకు ఫలితం దక్కేదెప్పుడు. అందుకే నేను గాంధీగా ప్రశ్నిస్తున్నా అని అన్నారు. ఎందుకంటే ప్రతి పక్షం బలాన్ని కోల్పోవటమే ప్రజాస్వామ్యం బలహీనమైంది. పత్రికలు స్పందించకుంటే, చచ్చేను ప్రజాస్వా మ్యం….. అత్యాచారాలకు, ఆడపడుచులు బలైపోతుంటే మానవులు మాధకద్రవ్యాల మత్తులో నరికి చంపుతుంటే మృగాలుగా మారి అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశా రు. ఏ హామీలుతో పరిపాలనా పగ్గాలు చేపట్టారో వాటిల్లో ప్రాధాన్యతలో మొదటి స్థానంలో వున్న అమ్మకు వందనం వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాదే అమల్లోకి తేవాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్.శివరంజని, ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …