Breaking News

కృష్ణా డెల్టాలోని చివరి ఎకరాకు కూడా నీరందిస్తాం

-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్టా డెల్టాకు నీటి సమస్య
-సాగునీటి రంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం
-కృష్ణా జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా డెల్టాలోని చివరి ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరిందించే బాద్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, కామినేని శ్రీనివాస్, వర్ల కుమార్ రాజాతో కలిసి పాల్గొన్నారు.
జిల్లాలోని రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. పట్టిసీమ పంపుల్ని గత ఐదేళ్ల పాటు గాలికి దిలేశారు. గేట్లకు గ్రీజు కూడా పూసే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూశాం. పులిచింతల లాంటి పథకాన్ని అవస్థల్లో పడేశారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి చూసి వర్షాలు కూడా సమృద్ధిగా కురిశాయి. శ్రీశైలం నుండి నీరు విడుదలయ్యాయి. నాగార్జున సాగర్ నిండింది, ఇవన్నీ రైతాంగానికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయాలు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో కూడా కృష్ణా డెల్టా సమస్యల్ని లేవనెత్తుతానని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన పాపాల కారణంగా జిల్లాలో తాగునీటి కోసం కూడా అవస్థలు పడాల్సి వచ్చింది. వ్యవసాయం దుర్బరంగా తయారైంది. కాల్వల్లో మట్టి, పూడిక తొలగించకపోవడం, డీ సిల్టింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. దాదాపు 40 టీఎంసీల నీరు నిల్వ ఉండే పులిచింతలలో కేవలం 0.8 టీఎంసీలున్నాయి. సాగర్, శ్రీశైలంలో నీరు నిల్వ లేకుండా పడేశారు. కృష్ణా డెల్టాలోని చివరి ఎకరాకు కూడా నీరందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నీటి నిర్వహణ సరిగా లేకపోవడంతోనే అవస్థలు ఎదురవుతున్నాయి. నీటి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పనులకు కూడా జగన్ రెడ్డి బిల్లులివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
1. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుండి పులిచింతల ప్రాజెక్టుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 2014 చట్టం ప్రకారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలని ఏకగ్రీవముగా తీర్మానం చేశారు.
3. కృష్ణ డెల్టాలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో లస్కర్లను నియమించేందుకు సమావేశంలో తీర్మానం చేశారు.
4. గన్నవరం నియోజవర్గంలో పోలవరం కుడి కాలవను 37.2 కిలోమీటర్లు, ఏలూరు కాల్వకు అనుసంధానాన్ని గన్నవరం ఎమ్మెల్యే ప్రతిపాదించిన మేరకు రూ.32.10 కోట్లను వెంటనే మంజూరుకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తీర్మానించారు.
5. కృష్ణ డెల్టాలో చివరి ఎకరాకు కూడా సాగునీరు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం. పంటలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉంది. ఆమేరకు అండగా నిలుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *