Breaking News

రాజధాని అమరావతి కోసం 4 లక్షలు విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని సిఎం పిలుపునిచ్చారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *