Breaking News

ఆప్యాయంగా, ఆత్మీయంగా పెన్షన్లు పంపిణీ లో మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరక్షణమే హామీని అమలు చేస్తూ సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారులకు అందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నిడదవోలు మండలం పురుషోత్తపల్లి, నిడదవోలు పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీలోని లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే   హామీని అమలు చేస్తూ రు. 3 వేలు రూపాయలు కలుపుకొని బకాయిలతో సహా గత జులై నెలలో పెంచిన రు. 4 వేలతో పాటు రు. 7 వేల రూపాయలను లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించామన్నారు. అదేవిధంగా నేడు క్రమం తప్పకుండా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు 1వ తేదీ  ఉదయం 5 గంటల నుంచి  లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. నిడదవోలు మండలంలో పదివేలకు భయపడి పెన్షన్లు ఉన్నాయని సుమారు రు. 4 కోట్ల 53 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు పెద్దలు భారం కాదు వారు ఉండటం మాకు ఉపయోగం అనే విధంగా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ద్వారా అర్హులైన అందరికీ రు.4 వేల రూపాయలను అందిస్తున్నామన్నారు. పురుషోత్తపల్లి గ్రామంలో 653 పెన్షన్లు ఉన్నాయని వారందరికీ సుమారు 25 లక్షలు రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు  ఉదయం 5 గంటలకే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్లు రు. 3వేల నుంచి రు. 4 వేల వరకు, విభిన్న ప్రతిభావంతులకు రు. 3 వేల నుంచి నుంచి రు. 6 వేల వరకు, ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి రు.15 వేలకు పెంచి  ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటలకే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ను అబ్ధిదారులకు అందించడం అందిస్తున్నామని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి అభివృద్ధిని కోరుకుంటూ పాలన సాగిస్తున్నారని. మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఏ దుర్గేష్, ఎంపీడీవో, జెఎ ఝాన్సీ, మండల తాసిల్దార్ పి.శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ ఎం.వెంక టేష్ సర్పంచ్, ఎం నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మీ ప్రసన్న, ఎన్. చిన్న వెంకటేశ్వర్లు జుజ్జు వరపు గోపాలకృష్ణ, జుజ్జు వరపు భాస్కర రావు, ఇమ్మణి చిన అప్పారావు జగతి నెహ్రూ, ముళ్ళ పూడి పెద్ద సుబ్బారావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొ న్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *