Breaking News

పెండ్యాల ఇసుక ర్యాంపును తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా

-ఇసుక కోసం అభ్యర్థనే ప్రామాణికం
-లోకల్ , నాన్ లోకల్ అన్న పరిస్థితి లేదు
-ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో అనుమతి
– ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
– కలెక్టర్ పి ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక ర్యాంపుల వద్ద విధుల్లో ఉండే ఉద్యోగులు నిబద్దత , జవాబుదారీతనం కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం అధికారులతో కలిసి పెండ్యాల ఇసుక ర్యాంపు ను కలక్టర్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు నిర్వహించాలని ఆదేశించారు. డ్యూటీ లో ఉండే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం, జవాబుదారీ తనం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఇసుక కోసం వినియోగదారుడు చేసుకున్న అభ్యర్థనే  ప్రామాణికం ఇసుక పంపిణి విధానం అమలు చెయ్యాలని స్పష్టం చేశారు. లోకల్ , నాన్ లోకల్  అన్న పరిస్థితి లేదని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రీచ్ లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు ఇసుక అమ్మకాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రీచులలో ఇసుక లభ్యతను క్యూ లైన్లు లో ఉండే వాహనం బట్టి టోకెన్లు జారీ చేయడం జరుగు తుందన్నారు. సాయంత్రం ఆరు తర్వాత ఎటువంటి లోడింగ్ జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పెండ్యాల ఇసుక ర్యాంపు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన వాహనాలను కలెక్టర్ ప్రత్యక్షంగా క్రమబద్ధీకరించడం జరిగింది. అధికారుల సూచనలను పాటించాలని ట్రాన్స్ పోర్ట్ దారులకు కలక్టర్ తెలియ చేశారు. సమయపాలన పాటించడం లో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వారి ఆదేశాల మేరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఇసుక రవాణా కోసం అనుమతి ఇస్తామని, ఇందు కోసం వరసలో ఉన్న వాహనంను పరిగణన లోనికి మొదట లోడ్ చేసేందుకు అనుమతిని ఇవ్వనున్నట్లు తెలియ చేశారు.

ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ జీ. నరసింహులు , మైన్స్ ఏ డీ ఎమ్. సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *