-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No. 18 తేదీ:18-02-2013, మరియు G.O.Ms.No. 55 తేదీ: 08.04.2003, రవాణా, రోడ్లు & భవనాలు (రోడ్లు-1) శాఖ ప్రకారం R&B రోడ్లపై ఎటువంటి కొత్త విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
రోడ్లపై విగ్రహాలు/ స్మారక చిహ్నాలు అనివార్యమైనట్లయితే, అవి పెద్ద ట్రాఫిక్ ఐలాండ్లు, పబ్లిక్ గార్డెన్లు, పార్కులు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాలు, టౌన్ హాల్స్ లేదా ప్రజా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేసుకోవా లని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం అవసరమైతే, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని విగ్రహ (statue) కమిటీ సిఫార్సు మరియు పోలీసు సూపరింటెండెంట్, SE (R&B), ఛైర్మన్/ CEO స్ధానిక మునిసిపల్ బాడీ వారి సిఫార్సు అనుసరించవలసి ఉంటుందని పేర్కొన్నారు. SE (PR), S.E. (AP Transco) E.E. (R&B) వారి సూచనలను అనుసరించాల్సి ఉంటుందన్నారు.
గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి, ప్రభుత్వ రహదారులు, ఇతర ప్రజా వినియోగ స్థలాలలో ఎటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి లేదా ఏదైనా నిర్మాణాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వకూడదని ఇందుమూలంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలియ చేశారు. . పైన పేర్కొన్న జిల్లా స్థాయి అధికారులందరూ, గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖచ్చితంగా పాటించ వలెనని ఇందుమూలముగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది.
గ్రామ మరియు మండల స్థాయి అధికారులందరూ అప్రమంతంగా వుండి పై ఆదేశాలను అమలు చేయవలసినదిగా కొరడమైనది. ఆదేశాలకు వ్యతిరేకంగా , ఎవరైనా ఆవిధంగా ప్రవర్తించినట్లతే సత్వరమే చర్యలు తీసుకోబడునని తెలియ జేయడమైనది.