Breaking News

ప్రయాణికులకు వాహనాలు నడిపటప్పుడు వారికి భద్రతా పై అవగాహన

-“డిఎల్ఎస్ఏ” ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం
-డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
వాహనాలు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం వారి సామాజిక బాధ్యతే కాకుండా , విలువైన ప్రాణాలను సైతం కాపాడు కోవడం సాధ్యం అవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు తెలిపారు. వారు శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులతో వాహన నడిపే సమయం హెల్మెట్, సీటు బెల్టు ధారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్సి కార్యదర్శి కె. ప్రకాశ్ బాబు మాట్లాడుతూ, వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిపై ఒక కుటుంబం ఆధారపడింది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇచ్చే సందర్భంలో తగిన జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా , ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల గురి అయ్యే అవకాశం ఉందన్నారు. లైసెన్స్ లేకుండా పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అటువంటి వాహనాలను సీజ్ చేసి యజమానులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కూటర్లు మోటార్ సైకిల్ నడిపే సమయం లో హెల్మెట్ ధారణ, కార్లు నడిపి సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మీ ఇంటి వద్ద మీకోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారన్న స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. రోడ్డు మీదికి వచ్చే వాహనదారులు తగిన నియమ నిబంధనలు పాటించకపోవడం చాలా బాధాకరం అన్నారు. మన భద్రత మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి కె. షర్మిల అశోక్, డిపో మేనేజర్ షేక్ సబ్నం, ఆర్టీసీ అధికారులు జి. రామకృష్ణ, పి హరినాద్ రావు , సోమశేఖర్, ఎస్ బి ఎల్ రావు, ఏ పద్మజారాణి, , సిబ్బంది , ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *