-వైసీపీ నేతల అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు
-భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు
-ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలకోసం వచ్చిన అనేక అర్జీలు
-ప్రతి అర్జీని పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చిన నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసమర్థ అరాచక అక్రమాల అనాలోచిత నిర్ణయాలకు పెట్టిన కోటగా నాటి తాడేపల్లి ప్యాలెస్ నుండి జరిగిన పాలనలో.. ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువైయ్యాడు. బెదిరింపులు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు దోపిడీలు రక్తపాతమే రాజ్యంగా జరిగిన నాటి పాలనలో రాబందుల నుండి బతికి బయట పడితే చాలురా దేవుడా అనుకొంటూ.. మౌనం వహించిన జనం ఓటైన తమ ఆయుదాన్ని ఎన్నికల్లో వాడి… నాటి పది తలల రాక్షసుడికంటే ఘోరమైన వైసీపీని వైనాట్ 175 అంటూ విర్రవీగిన అహంకారిని 11 సీట్లకు పరిమితం చేసి పాతిపెట్టారు. నాడు రాక్షస వధతో పండుగలు జరుపుకున్న జనం వలే.. నేడు అరాచకమూకల పతనంతో ప్రజలు భయం వీడి.. నాటి బెదిరింపులు, భూ కబ్జాలు దౌర్జన్యాలపై వినతులతో తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి పరిష్కారం పొందేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అర్జీదారులు తండోపతండాలుగా వస్తున్నారు. అందులో భాగంగా నేడు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత లు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.
గత పాలకులు ఇనుప కంచెలు కట్టుకుని నేటికి ప్రజలకు దూరంగా ఉంటుంటే… అధికారంలో ఉన్న తాము ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రజల ప్రేమానురాగాలను పొందుతూ.. ప్రజలు కట్టే అభిమాన సంకెళ్లలకు బందిలై ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. తాడేపల్లి కొంపలో అడుగుపెడితేనే సెక్యూరిటీ గార్డులు తంతున్నారని… ఆ వీడియోలు వైరల్ అయ్యాయని… నేడు టీడీపీ కార్యాలయానికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజలకు వస్తోందని… అర్జీదారులు సంతృప్తి చేందేలా సమస్యలపరిష్కారానికి కృషిచేస్తామని నేతలు తెలిపారు. నేడు ప్రజలకు టీడీపీ నాయకులంటే భరోసా ఇచ్చే నేతలుగా కనిపిస్తున్నారని.. టీడీపీ కార్యాలయాలకు స్వేచ్చగా రాగలుగుతున్నారని తెలిపారు. ఓడిపోవడంతోనే గత పాలకులు ప్రజలను వీడి పత్తాలేకుండా పోయారన్నారు. మేము ఓడినా గెలిచినా ప్రజలకోసం పనిచేసే నాయకులమని పేర్కొన్నారు. ప్రజలకోసం పనిచేసే నాయకులు ఎవరో… ప్రజలను హింసించి దోచుకుని దాచుకొని పారిపోయే నాయకులు ఎవరో ప్రజలే గుర్తించాలని కోరారు.
• పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి స్వాగ్రామంలో వైసీపీ నేతలు తన భూమిలోకి అడుగు పెట్టనివ్వడంలేదని… ఒక్క సంవత్సరానికి కౌలుకు ఇస్తే… నాలుగేళ్లు అయినా కౌలు చెల్లించకుండా.. భూమిలోకి అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారి బాధితురాలు పిన్నెబోయిన రవణమ్మ వాపోయింది. వైసీపీ నేతలు చంపేస్తారన్న భయంతో తాను మార్కాపురంలో తలదాచుకుంటున్నానని… దయ ఉంచి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.. తన భూమిని విడిపించాలని కోరింది.
• గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన మహ్మద్ ఖాశీం, షేక్ జిలాని, షేక్ అర్షతున్నీసాలు విజ్ఞప్తి చేస్తూ.. తాము టీడీపికి చెందిన వారమని గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టి తమ భూములను లాక్కున్నారని.. దయ ఉంచి విచారణ చేపట్టి న్యాయాన్ని నిలబెట్టి తమ భూములను తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
• నెల్లూరు జిల్లా కొండాపురం మండలం పార్లపల్లి గ్రామ పంచాయితీలో 17 ఎకరాల 80 సెంట్లు పశువుల పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని… పశువులకు మేతగా ఉపయోగపడే భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో పశువుల మేతకు ఇబ్బందిగా ఉందని.. దయచేసి ఆ భూమిని కబ్జానుండి విడిపించాలని పార్లపల్లి గ్రామస్తులు పలువురు విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా అదే మండలానికి చెందిన భీమవరప్పాడు గ్రామంలో 36 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీ పేరుమీద రిజిస్టర్ చేసి అక్రమంగా వైసీపీ నేతలు సర్పంచ్ ఉప సర్పంచ్ లు అమ్మేశారని భీమవరప్పాడు గ్రామస్తులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• గత ప్రభుత్వంలో విదేశీ విద్యా కానుకకు అప్లికేషన్ పెట్టుకున్నా తాము టీడీపీ వారమని మంజూరు చేయలేదని… విద్యాకానుక వస్తుందన్న ఆశతో తన కొడుకు విదేశాల్లో చదువుకోసం వెళ్లాడని… విదేశీ విద్యాకానుక రాకపోవడంతో ఫీజుల భారం అధికంగా ఉందని… దయ చేసి తన కుమారిడికి విదేశీ విద్యాకానుకను ఇప్పించాలని విజయవాడకు చెందిన పెంటినాయుడు విజ్ఞప్తి చేశాడు.
• ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరుకు చెందిన మేడూరి స్వర్ణకుమారి విజ్ఞప్తి చేస్తూ… వైసీపీ నాయకుల అండతో తమ భూమిని ఆక్రమించుకున్నారని… పోలీసులు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని… తాము ఎస్సీ కులానికి చెందిన వారం కావడంతో నాడు మమల్ని చెప్పులతో కొట్టి… నోటికొచ్చినట్లు బూతులు తిట్టారని.. నక్క వెంకన్న, రవిలపై ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు… తమ భూమిని ఆక్రమణనుండి విడిపించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
• గత ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన తామ భూమి ఇతరుల పేరు మీద ఎక్కిందని… దాన్ని కబ్జా చేసేందుకు వారు యత్నిస్తున్నారని.. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన చింతల శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలని కోరాడు.
• పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ప్రభుత్వం భూమి డొంక పోరంబోకును పలువురు ఆక్రమించుకున్నారని… ఆ30 సెంట్ల విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని. దాన్ని ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్ కు ఉపయోగించాలని ఆవుల సాంబశివరావు విజ్ఞప్తి చేశాడు
• తాము టీడీపీకి చెందిన వారమని తమ ఇళ్లపై అనేక సార్లు దాడులు చేసి కొట్టారని… నాడు కొండాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గిట్టిగుండాల పాలెం ఎస్సీ కాలనీకి చెందిన పదర్ల సువర్ణమ్మ వాపోయారు. తమకు కొట్టిన వైసీపీనేతలపై కేసులేపెట్టి… పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
• తనను 2019 లో వైసీపీ నేతలు కిడ్నీప్ చేశారని.. ఆ కేసు రాజీకోసం అనేక అక్రమ కేసులు తనపై బనాయించారని.. దాంతో తాను చాలా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని… దయతో తనకు ఆర్థిక సాయం చేయాలని కడప జిల్లా యర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామానికి చెందిన పద్మావతి విన్నవించారు.
• వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అనుచరుడు కన్నయ్య తనను రోకలి బండతో కొట్టడం వలన తీవ్ర గాయలై వెన్ను సమస్యతో బాధపడుతున్నానని.. టీడీపీ కార్యకర్త ముని శేఖర్ వాపోయాడు… తన ఆరోగ్య సమస్య పరిష్కారానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరాడు
• 2014 నుండి 2019 మధ్య చేసిన నీరు చెట్టు పనుల బిల్లులను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపేసిందని దాంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని… అప్పుల పాలయ్యామని.. కావున వెంటనే నీరు చెట్టు బిల్లులు మంజూరు చేయాలని నెల్లూరు జిల్లా sr పురం మండలానికి చెందిన పలువురు బాధితులు వాపోయారు.
పలువురు దివ్యాంగులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయగా.. మరికొందరు తమకు ఇళ్లు లేదని ఇళ్లు ఇప్పించాలని వేడుకున్నారు. వృద్ధులు పింఛన్ లకోసం అర్జీలు అందించగా.. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ద్వారా పనులు చేసిన వారికి బిల్లులు రాలేదని పలువురు వినతులు అందించారు. జంగారెడ్డి గూడెం డివిజన్ పరిధిలో మరికొందరు నోటరి అడ్వకేటర్స్ రెన్యువల్ కొరకు విన్నవించుకొన్నారు. మరికొందరు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ బెన్ఫిట్స్ ను అందించాలని వేడుకోన్నారు.. అంతే కాకుండా భూసమస్యలపై అనే ఫిర్యాదులు అందాయి.