మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
కడియం నర్సరీలకు పర్యటక రంగం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశలో మధురపూడి విమానాశ్రయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయం కలెక్టర్ సందర్శించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో కడియం నర్సరీలకు అదనపు ఆకర్షణ ఆదాయ కేంద్రం గా మలిచే దిశలో కడియం నర్సరీలు సోయబాలు, పచ్చదనం పరీఢవిల్లేలా స్టాల్ ఏర్పాటు చేసేందుకు క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలన చెయ్యడం జరిగిందన్నారు. 2027 పుష్కరాలకు ముందుగా హరివిల్లు (పూల స్టాల్ ) ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పై అధికారులతో మాట్లాడడం జరిగింది. గోదావరి పుష్కరాలు నేపథ్యంలో సాంస్కృతిక, పర్యాటక , ఆధ్యాత్మిక , నర్సరీ ల హబ్ గా గుర్తింపు దిశలో మధురపూడి విమానాశ్రయంలో కడియం నర్సరీలు పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం లో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్శన లో భాగంగా ప్రముఖలు పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ ను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ఆర్డీవో కె.ఎల్. శివజ్యోతి , ఎయిర్ పోర్ట్ అధికారి ఎస్. జ్ఞానేశ్వర రావు, ఎపిఎమ్ఐపి అధికారి ఏ. దుర్గేష్, తదితరులు పాల్గోన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …