రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష 08-12-2024 న జరుగును. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి. యస్.టి విద్యార్థులకు రూ. 50/- దరఖాస్తులను ఆన్ లైను లో 05-08-2024 నుండి స్వీకరించబడును. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 06-09-2024 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 10-09- 2024. పరీక్ష రుసుమును ఆన్లైన్ అప్లికేషన్ లో ఇవ్వబడిన SBI Collect లింకు ద్వారా మాత్రమే చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో తెలుసుకొనగలరని విద్యాశాఖాదికారి కె. వాసుదేవరావు, జిల్లా పాఠశాల విద్యాశాఖాదికారి విద్యాశాఖాదికారి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వారు తెలియచేసియున్నారు.
Tags rajamandri
Check Also
అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి
-APUWJ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ …