-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం 24 జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎస్ఆర్, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లోని 40,781 పాఠశాలలకు గాను 40150 (98.45%) పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. 631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు.