Breaking News

మన దేశం వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలు 735….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 735 మెడికల్ కాలేజీ లలో 1,12,312 ఎంబీబీఎస్‌ సీట్లు. గత ఏడాది కంటే 29 కళాశాలలు, 3,272 సీట్లు పెరిగినట్టు కేంద్రం వెల్లడి… 60 కళాశాలలతో 5వ స్థానంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో 35 మెడికల్ కాలేజీల్లో మొత్తం 6,210 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 735 వైద్య విద్య కళాశాలలు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అందులో 1,12,312 సీట్లు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలను రాష్ట్రాల వారీగా పార్లమెంట్‌కు నివేదించింది. అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలవగా.. ఎంబీబీఎస్‌ సీట్ల పరంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో గత ఏడాది 74 మెడికల్‌ కాలేజీలు ఉండగా తాజాగా ఆ సంఖ్య 77కు పెరిగింది. కర్ణాటకలో ఇప్పటికే 73 ఉండగా మరో మూడు ఏర్పాటయ్యాయి. 72 కాలేజీలతో ఉత్తరప్రదేశ్‌, 70 కాలేజీలతో మహారాష్ట్ర వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది ఆ రెండూ రాష్ట్రాల్లో 68 కాలేజీల చొప్పున ఉండడంతో సమానంగా నిలిచాయి. ఈ ఏడాది వాటి స్థానాల్లో మార్పు వచ్చింది. నిరుడు నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఐదో స్థానానికి పడిపోయింది. తెలంగాణలో గత ఏడాది 56 మెడికల్‌ కాలేజీలు ఉండగా వాటి సంఖ్య 60కు చేరింది. గుజరాత్‌ 40, ఆంధ్రప్రదేశ్‌ 37, రాజస్థాన్‌ 37, పశ్చిమబెంగాల్‌ 36, కేరళ 34, మధ్యప్రదేశ్‌ 28 కాలేజీలతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.

మన 5 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు, కాలేజీలు ఉన్నాయి. గతేడాది 270 కాలేజీలు ఉండగా వాటి సంఖ్య 281కు పెరిగింది. ఇది దేశంలోని మొత్తం కాలేజీల్లో 38 శాతం. మొత్తం 44,270 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇది మొత్తం సీట్లలో 39 శాతం. కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 12,345 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ఆ తర్వాత తమిళనాడులో 11,900, మహారాష్ట్రలో 10,945, ఉత్తరప్రదేశ్‌లో 10,525, తెలంగాణలో 8,690 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ UG సంబంధించి… 35 మెడికల్ కాలేజీల్లో మొత్తం 6,210 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి, 3,856 సీట్లు కన్వీనర్ కోటా కింద రిజర్వ్ చేయబడ్డాయి. అదనంగా, డెంటల్ కాలేజీల్లోని 1,540 బీడీఎస్ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో మొత్తం 175 సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *