రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెూంశాఖామాత్యులు వంగలపూడి అనిత ప్రత్యేక మహిళా కారాగారమును సోమవారం సందర్శించినారు. హోమ్ మంత్రి కి మహిళా కారాగారమునకు రాగానే మహిళా జైలు కానిస్టేబుల్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించి, వారిని ప్రసంశించారు. అనంతరం హోం మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జైళ్ల శాఖాధికారి కుమార్ విశ్వజీత్ లతో కలిసి జైలు మొత్తం తిరిగి చూసినారు. ఖైదీలను పలకరించి వారి క్షేమ సమాచారములు అడిగి తెలుసుకొనినారు. ఖైదీల యొక్క భోజనం, ఇంటర్వ్యూలు, ఫోను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొనినారు. ఖైదీల భోజనం రుచి చూసి బాగుందని చెప్పినారు. ఖైదీలకు స్పెషల్ రెమిషన్ జీవో తొందరగా రావటానికి ప్రయత్నిస్తామని హోమ్ మంత్రి చెప్పినారు. జైలునందు బేకరి యూనిట్ తిరిగి చూసినారు. ఇక్కడ చేసిన కేకు మొదలైనవి రుచి చూసి చాలా బాగున్నాయని వారిని ప్రశంసించినారు. సిబ్బందిని కూడా పలుకరించి వారి యొక్క ఫెసిలిటీస్ గురించి అడిగారు. జైలు నందు సానిటరీ నాప్కిన్ మేకింగ్ మెషిన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పియున్నారు. జైలు మొత్తం చాల ఆహ్లాద కరమైన వాతావరణం కలిగి ఉన్నదని, చాలా శుభ్రంగా ఉన్నాదని చెప్పి యున్నారు. మంత్రి తో పాటు ఏపి జైళ్ళ సంస్కరణల మరియు సర్వీసుల విభాగము, జైళ్ల శాఖాధికారి కుమార్ విశ్వజీత్, కోస్తా ఆంధ్ర ప్రాంతము, రాజమహేంద్రవరం జైళ్ల ఉపశాఖాధికారి ఎం. ఆర్. రవికిరణ్ గారు,తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు శ్రీమతి ప్రశాంతి, శాసన సభ్యులుఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి , తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహా కిషోర్, కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …