-ఓటరు జాబితా రూపకల్పన హేతు బద్దత ఉండాలి
-ప్రతివారం రాజకీయా పార్టీలతో సమావేశం నిర్వహించాలి
-డి ఈ వో/ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మరీ రివిజన్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా, ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై, ఫోటో ఓటరు జాబితా తదితర అంశాలపై దిశా నిర్దేశాలను, సమయ పాలన పై సూచనలు తెలియజేశారు. ఈ సందర్భం గా నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, 2025 జనవరి 25 న నిర్వహించే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 18-19 ఎల్ మధ్య కొత్తగా ఓటరుగా నమోదు అయ్యే ఓటర్లకు ఏపిక్ కార్డులు పంపిణీ చెసే విధంగా ఇప్పటి నుంచే ఓటరు జాబితా రూపకల్పనలో హేతుబద్ధత కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది నాలుగు పర్యాయాలు ఓటర్ల జనవరి 1 , ఏప్రిల్ 1 , జూలై 1 , అక్టోబర్ 1 తేదీల్లో కొత్తగా 18 ఏళ్లు నిండిన వారీ పేర్లు ఓటరు గా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. యువ ఓటర్ల నమోదు పై ప్రత్యెక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎస్ ఎస్ ఆర్ 2025 లో భాగంగా ఆగష్టు,20 నుంచి అక్టోబర్ 18 వరకూ బి ఎల్ వో లు ఇంటింటి వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. కొత్త ఓటరు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. తొలగింపు విధానం లో ప్రోటోకాల్ మేరకు మరణించిన వారికీ చెంది డెత్ సర్టిఫికెట్ లేదా పంచనామా, ఆయా రికార్డులు తప్పనిసరిగా ఋజువులుగా చూపాల్సిన ఉంటుందన్నారు. ఫార్మెట్ 1 నుంచి 8 వరకూ నిర్వహించి నివేదికలు సిద్ధం చెయ్యాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయ్యాల్సి ఉందన్నారు. 2024 అక్టోబర్ 19 నుంచి 20 వరకూ సమీకృత నమూనా ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. తదుపరి డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ అక్టోబర్ 29 ప్రచురించి, వాటిపై అభ్యంతరాలను అక్టోబర్ 29 నుంచి నవంబరు 28 వరకు స్వీకరించి, డిసెంబర్ 24 తేది లోగా పరిష్కరించాలన్నారు. ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపకల్పనలో హేతుబద్ధత కలిగి ఉండేలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు రాజమండ్రి సిటీ / మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, కొవ్వూరు – సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, రాజమండ్రీ రూరల్ ఇంచార్జీ జెసి జి నరసింహులు , గోపాలపురం/ రాజానగరం ఎస్ డి సి కె ఎల్ శివ జ్యోతి, అనపర్తి. ఎస్ డి సి – ఎం. మాధురి, నిడదవోలు ఎస్ డి సి ఆర్ వి రమణ నాయక్, రాజమండ్రి రూరల్ ఎస్. సరళ వందనం, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.