Breaking News

ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా “హర్ ఘర్ తిరంగా”

-జిల్లాలో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తి వంతంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక “వై జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే జిల్లాలో అధికారులతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు చిన్నారులు జాతీయ జెండాలను చేతబూని జిల్లాలో హర్ ఘర్ తిరంగా వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడటం మనందరి భాద్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఈనెల 9 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్చంద సంస్థలు, యువత భాగస్వామ్యులు కావాలని దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమములో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని దేశభక్తి పెంపొందించాలని పిలుపు నిచ్చారు.

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను, వారి నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని వారిని సత్కరించుకోవలసి ఉందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. వారీ త్యాగము స్మరణ కు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో, ప్రతి మండల కేంద్రాల్లోను, గ్రామాల్లోను వాడవాడల జాతీయ సమగ్రతను తెలిపే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా మన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ సమైక్యతను పెంపొందించేలా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ జెండా పండుగ నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ వారిని, వారి కుటుంబ సభ్యులని సన్మానించడం ద్వారా రానున్న తరాలకు వారి స్ఫూర్తిని తీసుకొని వెళ్లడంఇటువంటి ర్యాలీలు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

ఈ ర్యాలీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, డి ఆర్ డి ఎ పి డి ఎన్ వివి ఎస్ మూర్తి, టూరిజం ప్రాంతీయ ఉపసంచాలకులు స్వామి నాయుడు, డీఈవో. కె. వసుదేవ రావు, సెంట్రల్ డిఎస్పీ కె. రమేష్ బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అర్బన్ దిలీప్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి బివివి శేషగిరిరావు, ఇంటర్మీడియట్ అధికారి జీవీఏల్ సుబ్రహ్మణ్యం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *