Breaking News

మంత్రి దుర్గేష్ చొరవతో రహదారి మార్గానికి మోక్షం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తీపర్రు – తాడిపర్రు అప్రోచ్ రహదారికి తక్షణ మరమ్మత్తులని చేపట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రానున్న వేసవి కాలంలో
పూర్తి స్థాయిలో ఈ రహదారి కి మరమ్మత్తు పనులను చేపట్టే అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పెరవలి మండలం తీపర్రు – తాడిపర్రు గ్రామాల మధ్య అనుసంధానంగా ఉన్న ఆర్ అండ్ బి అప్రోచ్ రహదారి కుంగి పోవడం జరిగిందనీ తెలిపారు. హెచ్చరికగా జెండాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో పెరవలి మండలం లో క్షేత్ర స్థాయిలో పర్యటన సందర్భంగా మంట్రీ దృష్టికి ఈ విషయం రావడం జరిగింది. ప్రజలకి ఈ రహదారి మార్గాన్న ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్ అండ్ బి అధికారులు తక్షణ మరమ్మత్తులు చేపట్ట వలసినది గా మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించి ఉన్నారు. ఈ రహదారి మార్గానికి పూర్తి స్థాయిలో మరమ్మత్తు పనులను రానున్న వేసవి కాలంలో చేపట్టే విధంగా ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు. ఆ క్రమంలో రహదారి మార్గంలో ఉన్న రహదారీ మరమత్తులు, గట్ల రివిట్మెంట్ పనులను ఆర్ అండ్ బి అధికారులు చేపట్టి ప్రజలకు ఈ రహదారి ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. స్థానిక ప్రజలు ఈ రహదారి మార్గం అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *