-జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆగస్టు 14 న తేదీ అనగా బుధవారం నాడు విజయవాడలో ఎంప్లాయేంట్ ఎక్సేంజ్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి. విక్టర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా విక్టర్ బాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీ రామ్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు. ఈ మిని జాబ్ మేళాలో 1 కంపెనీలో గల పలు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తంగా 73 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 13 మంది ఎంపికయ్యారు.