రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అజాధికా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ జెండా కార్యక్రమంలో భాగంగా గోదావరీ నది ఒడ్డున గోదావరీ హారతి కార్యక్రమం, జాతీయ జెండా పండుగలో లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. అజాధికా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా బుధవారం పర్యాటక, దేవదాయ , మత్స్య శాఖ, ఆర్ ఎం సీ అధ్వర్యంలో పుష్కరఘట్ వద్ద సాంసృతిక, ఆధ్యాత్మిక, జాతీయ జెండా ప్రదర్శన, మత్స్య కారులు ప్రదర్శన లు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో గోదావరీ హారతి కార్యక్రమం కు మరింత శోభ చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం నగరానికి గోదావరీ హారతులు ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా రూపుద్దిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు. గోదావరీ పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.
గోదావరీ హారతులు:
దూప హారతి, ఏక హారతి , నేత్ర హారతి, బిల్వ హారతి , నాగ హారతి, పంచ హారతి, ముత్య హారతి, నంది హారతి, సింహ హారతి, రుద్ర హారతి, చక్ర హారతి, కుంభ హారతి, కర్పూర హారతి, నక్షత్ర హారతి లు పండితులు అత్యంత శోభాయమానంగా, భక్తి ప్రపత్తులతో హారతులు సమర్పించారు. చిన్నారులు జాతీయ భావం తో కూడిన నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది.
హారతులు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం మత్స్య కారులతో, నృత్య కళాకారులు లతో కలిసి జెండా ప్రదర్శన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గోన్నారు.